telugu navyamedia
సినిమా వార్తలు

ఆ పెద్దరికం గురువు దాసరితోనే పోయింది: మోహన్ బాబు

తెలుగు సినిమా రంగం “మా ” ఎన్నికలతో రెండు గ్రూపులుగా చీలిపోయింది. ఒకటి మెగాస్టార్ చిరంజీవిది కాగా మరోటి మంచు మోహన్ బాబుది . “మా ” అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. తోటి నటీనటుల ఓట్ల కోసం పార్టీలిస్తున్నారు. తమ వాగ్ధానాలతో ప్రలోభపెడుతున్నారు. ప్రకాష్ రాజ్ కోసం మెగాస్టార్ చిరంజీవి, నాగ బాబు నటీనటులను ప్రభావిత చేస్తున్నారు . మంచు విష్ణు గెలుపు కోసం మోహన్ బాబు అందరికీ స్వయంగా ఫోన్ చేసి ” తన బిడ్డ విష్ణు కు ఓటేసి ఆశీర్వదించమని” అడుగుతున్నారు.

ఇప్పుడు “మా” ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయ. మీడియా కూడా ఈ ఎన్నికలకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇక న్యూస్ ఛానల్స్ అయితే ప్రకాష్ రాజ్, మంచి విష్ణు తో చర్చలు పెడుతున్నాయి. ప్రతిరోజూ అగ్గి రాజేస్తూనే వున్నాయి. ఇదిలా ఉంటే దర్శకులు దాసరి నారాయణ రావు అప్పట్లో సినిమా పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించేవారు. ఎందరో ఆయన్ని గురువు గారుగా భావించి ఆయన తీర్పులను గౌరవించేవారు. అందరినీ ఆయన తన కుటుంబం గా భావించేవారు. దాసరి నారాయణ రావు చనిపోయిన తరువాత చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి వుండాలని ఆయన్ని అడిగితే చిరంజీవి ఒప్పుకున్నారు.

కరోనా కష్ట కాలంలో కార్మికులను ఆదుకోవడంలో, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాధి నేతలతో చర్చిండంలో చిరంజీవి ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నారు. ఇది అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ , మోహన్ బాబు మాత్రం సినిమా రంగంలో పెద్దగా వున్న చిరంజీవిని ఒప్పుకోను అని చెప్పేశారు. ” ఆ పెద్దరికం మా గురువు దాసరి నారాయణ రావు గారితోనే పోయింది” అని ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. చిరంజీవి అంటే మోహన్ బాబుకు మొదటి నుంచి పడదు. వీరి మధ్య విభేదాలు 75 సంవత్సరాల తెలుగు సినిమా వేడుకల్లో బయటపడడ్డాయ్.

చిరంజీవిని లెజెండ్‌గా నిర్మాత , ఆ కార్యక్రమ సమన్వయ కర్త కె .ఎస్ .రామారావు ప్రకటించినప్పుడు. అదే వేదిక మీద వున్న మోహన్ బాబు తీవ్ర నీరసన తెలిపాడు. తన దృష్టిలో లెజెండ్స్ అంటే అన్న రామారావు, మరో అన్న అక్కినేని నాగేశ్వర రావు మాత్రమే నని స్పష్టం చేశారు. ఆ విషయంపై అప్పట్లో రచ్చ రచ్చ అయ్యింది. అప్పటి నుంచి చిరంజీవి , మోహన్ బాబు మధ్య కనపడని ప్రచ్చన్న యుద్ధం జరుగుతుంది .

ఈ ఇద్దరు వేదికలమీద కలసినప్పుడు మాత్రం మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పడానికి సభా మర్యాద కోసం కౌగిలించుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మోహన్ బాబు కు చిరంజీవికి మధ్య పచ్చ గడ్డి వేస్తె ఇప్పుడు భగ్గుమని మండిపోతుంది.

“మా ” ఎన్నికలు వీరిద్దరి మధ్య ఆజ్యం పోశాయని చెప్పవచ్చు. తెలుగు సినిమా రంగంలో పెద్దరికం తన గురువు దాసరితోనే పోయిందని మోహన్ బాబు ఈ సందర్భంగా ప్రకటించారు . అంటే మోహన్ బాబు చిరంజీవి పెద్దరికాన్ని అంగీకరించడం లేదని అర్ధమైపోయింది. “మా” ఎన్నికల్లో సినిమా రంగం ఇప్పుడు రెండు గ్రూపులుగా చీలిపోయింది. ఒకరిపై మరొకరు బురద చల్లుకొని కార్యక్రమంలో వున్నారు. తెర మీద అందరికీ ఆహాదాన్ని పంచె నటీనటులు “మా” లో ఆధిపత్యం కోసం ఇప్పుడు రోడ్డెక్కి పోట్లాడుకుంటున్నారు.

Related posts