telugu navyamedia
సినిమా వార్తలు

విష్ణు కోసం మోహన్ బాబు ప్రచారం

వచ్చే నెల 10న జరిగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికీ వీరు తమ ప్యానల్ సభ్యులను ప్రకటించారు. ప్రకాష్ రాజ్ కు మెగా హీరోల మద్దతు వుంది. మంచు విష్ణు గెలుపు కోసం మోహన్ బాబు స్వయంగా రఁగంలోకి దిగారు. తన సహ నటీనటుల మద్దతు కూడగడుతున్నారు.మోహన్ బాబు తన కుమారుడు విష్ణు తో కలసి హీరో కృష్ణ ఇంటికి వెళ్లారు. “మా” ఎన్నికల్లో విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడని , మద్దతు ఇవ్వమని మోహన్ బాబు అడిగిన వెంటనే “తప్పకుండా ” అని కృష్ణ చెప్పారట.

అక్కడే వున్న నరేష్ “నేను కూడా విష్ణుకే సపోర్ట్ చేస్తున్నా ” అని చెప్పారట. ప్రకాష్ రాజ్ కు మెగా హీరోలు మద్దతు ఇస్తుంటే మంచు విష్ణుకు కృష్ణ గారు మద్దతు ఇస్తున్నారు . ప్రకాష్ రాజ్ ఇప్పటికే “మా ” అధ్యక్షుడుగా ఎన్నికైతే ఏమేమి చెయ్యబోతున్నాడో మేనిఫెస్టో విడుదల చేసి , ప్రచారం కూడా మొదలు పెట్టారు. మంచు విషు తనని అధ్యక్షుడుగా ఎన్నుకుంటే ఏమి చెయ్యాలనుకున్నాడో ఈరోజున మేనిఫెస్టో విడుదల చెయ్యబోతున్నారు.


సాయంత్రం ఒక స్టార్ హోటల్లో “మా ” సభ్యుల కోసం ఒక విందు సమావేశాన్ని మోహన్ బాబు ఏర్పాటు చేశారు . ఈ సమావేశంలో పాల్గొనమని ముఖ్యులైన వారికి మోహన్ బాబు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారట . “మా ” ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత ప్రచార ఆర్భాటం, ఖరీదైన పార్టీలతో సభ్యులను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి . ఎవరికీ వారే దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారు . చివరికి “మా ” ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

Related posts