telugu navyamedia
సినిమా వార్తలు

వెండితెరపై గురువుగా బిగ్ బి… ఒకేసారి రెండు సినిమాలు

Amitab Bachchan Tweet on RGV

బాలీవుడ్ మెగాస్టార్ 76 ఏళ్ళ వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఇప్పటికీ భారీ క్రేజ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అమితాబ్. ఒక్క బాలీవుడ్ లోనే కాదు తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఏ భాషలోనైనా నటించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. 2019 గాంధీ జయంతి రోజున బిగ్ బి గురువు పాత్రల్లో నటించిన రెండు సినిమాలు తెరపైకి రాబోతున్నాయి. ఈ సంవత్సరం అమితాబ్ బచ్చన్‌కి ఎంతో ప్రత్యేకం కానుంది. ప్రస్తుతం అమితాబ్… ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఝుండ్’, ‘ఉయరంద మణిదన్’, ‘బ్రహ్మాస్త్ర’, ‘చెహ్రే’, ‘గులాబో సితాబో’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రలే ఆయన పోషిస్తున్నారు. కాగా వీటిలో ‘సైరా’, ‘ఝుండ్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్నాయని సమాచారం. హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిన ‘సైరా’లో బిగ్ బి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువుగా నటించగా… స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ‘ఝుండ్’లో ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు.

Related posts