పండగల సమయంలో ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి పండగ ముందు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయొద్దని ఆదేశించారు.
కొందరు ప్రయాణీకుల రద్దీని ఆసరాగా చేసుకొని అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని అలాంటి బస్సుల యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధిక ఛార్జీలు వసూలు చేసే ప్రైవేట్ బస్సుల యాజమాన్యంపై ఫిర్యాదు చేయాలనుకునే ప్రయాణికులు వాట్సప్ నంబరు 8309887955 కు సమాచారం పంపాలని మంత్రి సూచించారు.


వైఎస్ జగన్ పులివెందుల పులిబిడ్డ: సినీనటి రమ్యశ్రీ