telugu navyamedia
తెలంగాణ వార్తలు

మ‌త విద్వేశాలు రెచ్చ గొట్టి చ‌లికాచుకోవాల‌నేదే బీజేపీ ప్ర‌య‌త్నం..

* తెలంగాణ ఆర్టిక‌ల‌-3 ప్ర‌కార‌మే ఏర్ప‌డింది..
*అమ్మాయిలు చ‌దువుకోవ‌డానికి వెళితే క‌ర్ణాట‌క‌లో బెదిరిస్తున్నారు..
* మ‌త విద్వేశాలు రెచ్చ గొట్టి చ‌లికాచుకోవాల‌నేదే బీజేపీ ప్ర‌య‌త్నం..
* దేశంలో అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం ఉందా..?
* దేశంలో న‌రేంద్ర‌ మోదీ రాజ్యంగం న‌డుస్తోంది..
* రాజ్యాంగం మార్చాల‌ని కేసీఆర్ చేసిన‌ వ్యాఖ్య‌ల‌ను రాద్ధాంతం చేస్తున్నారు.
* రాజ్యాంగ సంస్థ‌ల‌న్నీంటినీ మోదీ త‌న గుప్పిట్లో పెట్టుకున్నారు..
*గ‌వ‌ర్న‌ర్‌ని ఈసీని మోడీ గుప్పిట్లో పెట్టుకున్నారు..
*ఇదేనా మీరు కోరుకున్న భార‌త‌దేశం..

గుజరాత్ కంటే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నామని మోదీకి కడుపుమంటగా ఉందని ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్​.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న కేటీఆర్​ మాట్లాడుతూ..50 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని అవమానించినందుకు రాష్ట్ర ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్​ డిమాండ్​ చేశారు.

దశాబ్దాల పోరాటాన్ని ప్రధానమంత్రి కించ పరిచారు. తెలంగాణకు ఇస్తానన్న కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమ, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వలేదు. మోదీ ఎనిమిదేళ్లలో తెలంగాణకు చేసింది సున్నా అని, తెలంగాణపై ముందు నుంచే మోదీకి పగ ఉంది. తెలంగాణలోని ఏడు మండలాలను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారు. దేశంలో అంబేడ్కర్ రాజ్యాంగం లేదు.. మోదీ రాజ్యాంగమే అమలవుతోంద‌ని అన్నారు. అన్ని సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని మోదీ పాలిస్తున్నర‌ని మండిప‌డ్డారు.

తెలంగాణలోని ఏడు మండలాలను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారు. దేశంలో అంబేడ్కర్ రాజ్యాంగం లేదు.. మోదీ రాజ్యాంగమే అమలవుతోందని కేటీఆర్ అన్నారు.

Related posts