telugu navyamedia
తెలంగాణ వార్తలు

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం- సతీమణికి గాయాలు..

జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెట్​పల్లిలోని ఎమ్మెల్యే ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని విద్యాసాగర్​ రావు తీమణి సరోజ వంటగదిలో సకినాలు చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. ఒక్కసారిగా సిలిండర్​ నుంచి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఎమ్మెల్యే సతీమణి సరోజకు మంటలు అంటుకున్నాయి.

ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు వెంటనే స్పందించి మంటలు ఆర్పారు . అప్పడికే గాయపడిన సరోజను చికిత్స నిమిత్తం హుటాహూటినా హైదరాబాద్​ ఆస్పత్రికి తరలించారు.

నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తు్న్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related posts