విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాపు నేస్తం పధకాన్ని జిల్లా ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ కాపు నేస్తం పధకం కింద విశాఖ జిల్లాలో రూ.22 కోట్లు లబ్ది దారులకు మేలు చేకూరుతుందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోందని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుందని చెప్పారు. ఆదాయ వనరులు తగ్గినా.. పథకాల అమలు నెరవేరుతుందన్నారు. తమ అజెండాలో మూడు రాజధానులు ఉన్నాయని అన్నారు. మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం తమ లక్ష్యమన్నారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు.
ఆంధ్ర ప్రదేశ్ అంటే అడవాళ్ల ప్రదేశ్ గా మారాలి: రోజా