telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

లోకేష్ తో .. అరవింద సమేత తీస్తే..  సూపర్ గా ఉండేది : వర్మ

Ram gopal Varma Fire Censor board
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు ప్రచారం నిజంగానే సరికొత్తగా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా లోకేష్ ను ఫ్యాక్షనిస్ట్ గా మార్ఫింగ్ చేసిన ఫోటో ట్వీట్ లో పోస్ట్ చేసి, దానిపై వరుస పోస్టులు పెట్టాడు. మొన్న తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా అంటూ ఓ మార్ఫింగ్ ఫోటో పెట్డాడు వర్మ . ఆ తర్వాత ఏమైందో కానీ .. ఆ ఫోటోలో తన తలను తీసేసి లోకేశ్ ఫోటో పెట్టి వరుసగా ట్వీట్ల వర్షం కురిపించాడు. కత్తిపట్టుకున్న నారా లోకేశ్ మార్ఫింగ్ ఫోటో పోస్ట్ చేస్తూ చిత్ర విచిత్రమైన కామెంట్లు పెట్టాడు.
వర్మ తనకు నారా లోకేశ్ కత్తి పట్టిన ఫోటో అమితంగా నచ్చిందంటున్నాడు. దావూద్ ఇబ్రహీం, ఒసామాబిన్ లాడెన్ కంటే కూడా నారా లోకేశ్ చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడని వర్మ సైటైర్లు పేల్చారు. అంతటితో ఆగకుండా లోకేశ్ కూ తారక్‌ కూ ముడిపెట్టి కామెంట్లు చేశాడు.
అరవింద సమేత సినిమాలో తారక్ బదులు లోకేశ్ ను హీరోగా పెట్టి ఉంటే .. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేదన్నాడు వర్మ. లోకేశ్ మాంచి హీరో కాకుండా పాలిటిక్స్ లోకి వెళ్లి అనవసరంగా తన టైమ్ వేస్టు చేసుకుంటున్నాడని సానుభూతి కురిపించాడు. అలాగే నారా లోకేశ్ సంబాషణా చాతుర్యం కూడా అద్భుతమంటూ పొగిడాడు వర్మ. మొత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రచారం భారీగానే చేస్తున్నాడు దర్శకుడు వర్మ. 

Related posts