గత వారం జరిగిన 2వ టెస్టులో భారత్ పై ఇంగ్లాండ్ ఓడిన తర్వాత చెన్నై పిచ్ పై తీవ్రంగా విమర్శించిన వారిలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఒకరు. టెస్ట్ యొక్క 2వ రోజు ప్రారంభంలో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేయడంతో వాన్ సోషల్ మీడియాలో మండిపడ్డాడు, ఇది మొదటి సెషన్ నుండే స్పిన్నర్లకు సహకరించే పిచ్ అని అన్నాడు తొలి టెస్టు పిచ్ కంటే కూడా ఇది “పేలవమైన పిచ్” అని వాన్ అభిప్రాయపడ్డాడు. అయితే రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 161 పరుగులు చేయగా, 2వ ఇన్నింగ్స్ లో అశ్విన్ సెంచరీ చేయడంతో భారత్ 317 పరుగుల తేడాతో వియజయం సాధించింది. ఇక తాజాగా 3వ టెస్టుకు ముందు భారత ఓపెనర్ రోహిత్ శర్మ ప్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ… అహ్మదాబాద్‌లోని పిచ్ చెన్నై మాదిరిగానే ఉంటుందని, అందువల్ల వారు పిచ్ పై నిందలు వేయడం అపి మానేసి దానికి బదులుగా ఆట మరియు ఆటగాళ్లపై దృష్టి పెట్టాలని కోరారు. పిచ్ రెండు జట్లకు ఒకటే. అందువల్ల పిచ్ గురించి ఎందుకు ఎక్కువ చర్చ జరుగుతుందో నాకు తెలియదు. మేము వేరే వద్దకు పర్యటనలకు వెళితే పించ్ పై కానుండ ఆట పై దృష్టి పెడతాం అని రోహిత్ తెలిపాడు. అయితే మొదట పిచ్ ను విమర్శించిన మైఖేల్ వాన్ నేను రోహిత్ మాటలతో ఏకీభవిస్తున్నాను అని తెలిపాడు.
previous post
next post
మంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారు.. నాయిని సంచలన వ్యాఖ్యలు