ఏపీసీఎం వైఎస్ జగన్ బావ అనిల్‌కుమార్‌పై నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. 2009 మార్చి 28న ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఖమ్మం కరుణగిరి ప్రాంతంలో ఓ పార్టీకి ఓటువేయాలంటూ కరపత్రాలు పంచారని ఆయనపై అప్పట్లో కేసు నమోదైంది.
ఆ కేసులో ఏ1గా ఉన్న అనిల్‌కుమార్ కోర్టుకు హాజరుకాకపోవడంతో సోమవారం ఆయన్ను కోర్టులో హాజరుపరచాలని ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు జడ్జి ఎం.జయమ్మ వారంట్ జారీ చేశారు.