ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించిన నేపథ్యంలో యోగా గురువు రాందేవ్ బాబా స్పందించారు. అయోధ్య కేసులో సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. మతాలు వేరైనా మనమంతా రాముడి వారసులమేనని అన్నారు.
సుప్రీం తీర్పుతో అయోధ్య వివాదాలన్నీపరిష్కారమైనట్టేనని చెప్పారు. అయోధ్య వివాదంసై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందని అంటూ సాధుసంతులు, మీడియా సమాజంలో శాంతి సామరస్యం నెలకొనేలా వ్యవహరించాలని సూచించారు. మందిర నిర్మాణానికి హిందువులకు ముస్లింలు సహకరించాలని కోరారు.
కాంగ్రెస్కు ఓటేస్తే టీఆర్ఎస్కు వెళ్లే పరిస్థితులు: కిషన్ రెడ్డి