telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రేపటి నుంచి పల్స్‌పోలియో..38 లక్షల మందికి చుక్కల మందు

pulse polio on 19th in telangana

పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్కల మందు వేసేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లుచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 38,36,505 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించారు.

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలకు 50,64,500 వాక్సిన్‌ డోస్‌లు సరఫరాచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23,331 చుక్కల పంపిణీ కేంద్రాల్లో, అదేవిధంగా అన్ని ఆసుపత్రులు, బస్టాండ్లు, మెట్రోస్టేషన్లు, రైల్వే స్టేషన్లలోనూ చుక్కల మందు వేయనున్నారు. ఆదివారం చుక్కలు వేయించుకోని పిల్లలకు 20, 21 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలను వేయనున్నారు.

Related posts