భారత మార్కెట్‌లో తొలి ఎలక్ట్రిక్ కారును ప్రముఖ కార్ల తయారీదారు ఎంజీ మోటార్స్ విడుదల చేసింది. ఎంజీ మోటార్స్ జెడ్‌ఎస్ ఈవీ పేరిట ఆ కారు విడుదలైంది. ఈ కారును రెండు వేరియెంట్లలో లాంచ్ చేశారు. ఎగ్జయిట్ వేరియెంట్ ధర రూ.20.88 లక్షలు ఉండగా, ఎక్స్‌క్లూజివ్ వేరియెంట్ ధర రూ.23.58 లక్షలుగా ఉంది.
ఇప్పటికే ఈ కార్లకు బుకింగ్స్‌ను నిలిపివేయగా, ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి రూ.1 లక్ష తగ్గింపు ధరతో ఈ కార్లను విక్రయించనున్నారు. ఇక ప్రస్తుతానికి కేవలం ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్ నగరవాసులకు మాత్రమే ఈ కారు అందుబాటులో ఉంటుంది.

