telugu navyamedia
ట్రెండింగ్

పెళ్లికి రెడీ అయిపోయిన మెగా హీరోయిన్‌ !

అనిల్ రావిపుడి దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ఎఫ్3. అయితే గత కొంతకాలంగా ఈ ఎఫ్3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో పాటు మరో హీరో కూడా చేయనున్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాస్తున్నాడు. ఎఫ్2ను కూడా దిల్ రాజే నిర్మాంచాడు. ఇందులో కూడా ఎఫ్2 మాదిరిగానే తమన్నా, మెహ్రిన్‌లూ కనిపించనున్నారు.  అయితే.. ఎఫ్ 2 సినిమాతో క్రేజ్‌ పెంచుకున్న మెహరీన్‌… ప్రస్తుతం ఎఫ్‌3 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉంది. అయితే.. ఈ భామ త్వరలో పెళ్లిపీటలెక్కనుందట. హర్యానా మాజీ సీఎం దివంగత భజన్‌లాల్‌ బిష్ణోయ్‌… మనవడు భవ్య బిష్ణోయ్‌ను ఆమె పెళ్లాడనుంది. మార్చి 13న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ విల్లాలో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరుగనుంది. వీరిద్దరు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి. పెళ్లి తర్వాత మెహ్రీన్‌ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 

Related posts