ఆరుగాలం శ్రమించి అధిక పెట్టుపడులతో పండ్ల తోటలు సాగు చేసిన రైతులకు మార్కెట్ లో దళారుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని కొత్తపేట పండ్ల మార్కెట్‌లో రైతుల పై దాడి ఘటన చోటుచేసుకుంది. రైతులపై కొందరు దళారులు దాడికి పాల్పడ్డారు. మార్కెట్‌కు తీసుకువచ్చిన బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని దళారులు రైతులను బెదిరింపులకు గురిచేశారు.
కాగా దళారుల రేట్లు నచ్చకపోవడంతో రైతులే నేరుగా విక్రయాలకు పూనుకున్నారు. దీంతో ఆగ్రహించిన దళారులు రైతులతో ఘర్షణకు దిగారు. పరస్పర దాడులతో మార్కెట్ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. డెంగ్యూ జ్వారాలు విజృంభించడంతో బొప్పాయి పండ్ల కు మార్కెట్ లో డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే.