ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్‌వార్న్‌కు లండన్ కోర్టు షాకిచ్చింది. పరిమితికి మించిన వేగంతో నడిపిన కేసులో సోమవారం లండన్ కోర్టు అతడి డ్రైవింగ్‌పై సంవత్సర కాలం పాటు నిషేధం విధించింది. వార్న్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఐదుసార్లు ఉల్లంఘించాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన వింబుల్డన్ మేజిస్ట్రేట్ కోర్టు అతడిపై ఏడాదిపాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధంతో పాటు రూ.1.62 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్ను: ఎంపీ కోమటిరెడ్డి