telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో మరో భారీ అగ్ని ప్రమాదం…ఒకరు మృతి

ఏపీలో మరో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాలోని ఎల్విన్‌పేటలో సిలిండర్‌ పేలడంతో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. దీంతో విజయలక్ష్మి అనే వృద్ధురాలు సజీవదహనం అయింది. విజయలక్ష్మి (55) ఒంటరిగా పూరి గుడిసెలో ఉంటుంది. ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీకై ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. దీంతో ఆమె అగ్నికి ఆహుతైంది. పెద్దగా శబ్దం రావడంతో పక్కనున్న పూరిళ్లలో ఉన్నవారు బయటికి పరుగులు తీశారు. దీంతో పక్కనున్న ఇళ్లలో కూడా మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న సిలిండర్లు కూడా పేలాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది.. మూడు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వృద్ధురాలు మినహా మరెలాంటి ప్రాణనష్టం జరుగలేదు.

Related posts