telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

దుబ్బాక ఉప్పు ఎన్నికలలో తెరాస ఓటమికి అతనే కారణమా..?

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.  మొదటి రౌండ్ నుంచి బీజేపీ లీడింగ్ కొనసాగిస్తూ వచ్చింది.  అయితే మధ్యలో తెరాస పార్టీ పుంజుకోవడంతో పాటుగా లీడింగ్ లోకి కూడా వచ్చింది.  కానీ, 20 వ రౌండ్ నుంచి ఫలితం మారిపోయింది.  20, 21, 22, 23 మిగతా రౌండ్ లలో బీజేపీ లీడింగ్ సాధించడంతో  విజయం సాధించింది.  ముందుగా సర్వేలు చెప్పినట్టుగానే బీజేపీ దుబ్బాకలో ఘన విజయం సాధించింది.  దుబ్బాకలో బీజేపీ 1118 ఓట్ల మెజారిటీతో తెరాస పార్టీపై విజయం సాధించింది. ఈ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామనుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెమటలు పట్టించి మరీ..బీజేపీ విజయం సాధించింది. తమ ఓటమికి చపాతి రోలర్‌ కారణమని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కారును పోలిన గుర్తును స్వతంత్ర అభ్యర్థికి చపాతీ రోలర్ ని కేటాయించారు. ఈ గుర్తే టీఆర్‌ఎస్‌ కొంప ముచ్చిందని సొంత పార్టీ నాయకులు అనుకుంటున్నారు.  అయితే..చపాతీ రోలర్‌ అచ్చం కారు లాగే ఉండటం విశేషం.  ఈ ఎన్నికలో కారును పోలిన గుర్తు చపాతీ రోలర్ కు 3489 ఓట్లు వచ్చాయి. అలాగే..నోటాకు నోటా కు 552 ఓట్లు పోల్‌ అయ్యాయి. చపాతీ రోలర్‌ ఓట్లు టీఆర్‌ఎస్‌ కు వచ్చేయని…దుబ్బాక ప్రజలు కారు గుర్తు అనుకుని చపాతీ రోలర్‌ కు వేసారని టీఆర్‌ఎస్‌ నాయకులు వాపోతున్నారు. ఏది ఏమైనా చివరికి దుబ్బాకలో బీజేపీ విజయం సాధించింది.

Related posts