telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పక్కా కమర్షిషల్‌ ఎంటర్‌టేనర్‌తో గోపీచంద్

మాచో హీరో గోపీచంద్ దర్శకుడు సంపత్ నంది సినిమా తరువాత… తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో గోపిచంద్ కు జోడిగా నటించే హీరోయిన్ స్థానంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇక తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో “సీటిమార్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు గోపిచంద్. అయితే… తాజాగా గోపీచంద్‌, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి కాంబోలో పక్కా కమర్షిషల్‌తో కొత్త మూవీ వస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇవాళే వచ్చింది. గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అయితే.. ఈ మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్ త్వరలోనే రాబోతుందని మారుతి పేర్కొన్నారు. కాగా.. ఈ సినిమాను మొదట మాస్‌ మహారాజ్‌ రవితేజతో చేయాలనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. రెమ్మునరేషన్‌ కారణంగా రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట.

Related posts