telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ పై వర్మ ట్వీట్… కులాభిమానం ఎక్కువైంది

Ram-Gopal-Varma

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా తీయబోతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు టైటిల్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తే… మిగతా సామాజికవర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రామ్ గోపాల్ వర్మ తాజాగా ఈ చిత్రం నుంచి “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు.

“సరిలేరు నీకెవ్వరు” ఇంట్రో సాంగ్‌ను మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల చేయగా… అదేరోజు వర్మ ఈ సాంగ్ ను కూడా విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. దీనిపై రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ… తమ పాట గూగుల్ ట్రెండ్స్‌లో దూసుకుపోతుందని వ్యాఖ్యానించాడు. అంతేకాదు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు యాక్ట్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’లోని ఇంట్రో సాంగ్ కంటే ఈ వీడియో పాటకే ఆదరణ లభించందని ట్వీట్ చేసాడు. ఇక రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” ప్రస్తుతం ట్రెండింగ్‌లో రెండో స్థానంలో ఉంది. మరోవైపు వర్మ మాట్లాడుతూ.. సూపర్ స్టార్స్ కంటే ప్రేక్షకులకు కులాభిమానమే ఎక్కువైంది. ఇది మంచి పరిణామం కాదని ట్వీట్ చేసాడు. కాగా ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న వర్మ, దీనికి సంబంధించిన వివరాలను బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతుండటం గమనార్హం. ఇక వర్మ చివరగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఎన్నో వివాదాలను ఎదుర్కొని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” చిత్రంతో వర్మ ఎలాంటి సంచనాలు సృష్టించనున్నాడో చూడాలి.

Related posts