*రెబల్ ఎమ్మెల్యేలకు శివసేన ఆఫర్..
*ఎమ్మెల్యేలంతా కోరితే ఎమ్‌వీవీ కూటమి నుంచి బయటకు వస్తాం
*20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు
మహారాష్ర్టలో రాజకీయం గంటగంటకు మారుతున్నాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తమ బలప్రదర్శన చేశారు ఏక్‌నాథ్ షిండే. తనకు 42 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని కొత్త వీడియో విడుదల చేశారు. తనదే అసలైన శివసేన అంటూ వెల్లడించారు.
ఈ క్రమంలో శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా సీఎంతో చర్చించాలని అన్నారు.
శివసేన ఎమ్మెల్యేలంతా కోరితే మహా అఘాడి కూటమి నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని..అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలంతా ముంబైకి రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ విశ్వాసపరీక్ష నిర్వహిస్తే తప్పకుండా ఉద్ధవ్ థాక్రే విజయం సాధిస్తారని అన్నారు.
మరోవైపు..శివసేన ఇంకా బలంగానే ఉందన్నారు. గౌహతిలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేల్లోని 20 మంది తమతో టచ్‌లో ఉన్నారని ఆయన వెల్లడించారు.
రెబల్ ఎమ్మెల్యేలు ముంబై వస్తే ఎవరు మాతో ఉన్నారో తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యేలంతా ఏయే పరిస్థితులు, ఒత్తిళ్ల మధ్య మమ్మల్ని వీడారో త్వరలోనే చెబుతా’ అని సంజయ్ రౌత్ అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాక్రేకి నిజమైన భక్తులు కాదని మండిపడ్డారు.
ఈడీ ని బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసి శివసేన ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చిందని రౌత్ ఆరోపించారు. ఈడీకి భయపడి పారిపోయిన ఎమ్మెల్యేలు నిజమైన బాల్‌థాక్రే అనుచరులు కాదన్నారు. మిగిలినవారమే నిజమైన భక్తులమన్నారు. తమకు కూడా ఈడీ ఒత్తిళ్లు ఉన్నాయి. అయినా శివసేనను వీడబోమని చెప్పారు. ఫ్లోర్ టెస్ట్ ఏర్పాటు చేస్తే ఎవరికి సానుకూలత, ఎవరికి ప్రతికూల అనే విషయాలు తెలుస్తాయని సంజయ్ రౌత్ విశ్వాసం వ్యక్తం చేశారు.
23 తర్వాత ఏపీ పౌరుషం ఏంటో తెలుస్తుంది: యామిని