రిపోర్టర్లందరికి ప్రభుత్వమే ఆరోగ్య రక్షణ కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరోనా వైరస్‌తో నగరానికి చెందిన జర్నలిస్ట్ మనోజ్ మృతి చెందడం తనని తీవ్రంగా కలచి వేసిందని తెలిపారు. మీడియా మిత్రులందరికి కరోనా టెస్టులు నిర్వహించి వారిని, వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. లాక్ డౌన్ సమయంలోనూ కరోనాపై పోరాడేందుకు కావాల్సిన సమాచారాన్ని చేరవేసిన మీడియా వారు కూడా కోవిద్ వారియర్సేనన్నారు.
రిపోర్టను ప్రత్యేక దృష్టితో చూసి వారి ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కరోనాపై ముందువరుసలో ఉండి పోరాటం చేస్తున్న రిపోర్టర్లను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. నిన్న డాక్టర్లు, నేడు రిపోర్టర్లు.. రాష్ట్రంలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయన్నారు.