telugu navyamedia
రాజకీయ

ఏక్‌నాథ్ షిండే బలప్రదర్శన..42 మంది ఎమ్మెల్యేలతో క‌లిసి అసోం​లో మకాం

మహారాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటుకు దిగిన ఏక్‌నాథ్‌ శిందే 42 మంది ఎమ్మెల్యేలతో క‌లిసి అసోం గువాహటిలోని రాడిసన్​ బ్లూ హోటల్​లో మకాం వేశారు. ఇందులో 35 మంది శివసేనకు చెందినవారుకాగా.. మరో ఏడుగురు స్వతంత్రులు ఉన్నట్లు తెలిపారు.

తమ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల ఫొటోలు, వీడియోలను ఏక్‌నాథ్ షిండే విడుదల చేయటం ద్వారా.. ఏక్‌నాథ్ షిండే తమ బలప్రదర్శన చేసినట్లయింది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలను పంపుతున్నారు. .

మ‌రోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సీఎం ఉద్ధవ్ థాక్రే పై తిరుగుబాటు బావుట ఎగురవేయడంతో.. ఆయన తన పదవి నుంచి దాదాపుగా తప్పుకున్నారు. సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి.. మాతోశ్రీకి వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఆయన వద్ద 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. తగినంత సంఖ్యాబలం లేనందున..ఆయన ఉద్ధవ్ థాక్రే ఏ క్షణమైనా రాజీనామా చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.గవర్నర్ రాజ్‌భవన్‌కు వచ్చిన తర్వాత.. నేరుగా అక్కడికి వెళ్లి..రాజీనామా సమర్పిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఏక్‌నాథ్ షిండే వెంట ఉన్న శివసేన ఎమ్మెల్యేలు వీరే

1.మహేంద్ర మోరే 2.భరత్ గోగావాలే 3.మహేంద్ర దాల్వి 4.అనిల్ బాబర్ 5.మహేష్ షిండే 6.శాహాజి పాటిల్ 7. శంభురాజే దేశాయ్ 8.దయారాజ్ చౌగులే 9.రమేశ్ బోర్నారే 10.తానాజీ సావంత్ 11. సందీపన్ బుమ్రే 12.అబ్దుల్ సత్తార్ 13.ప్రకాశ్ సర్వే 14.బాలాజీ కల్యాన్కర్ 15.సంజయ్ శిర్సాత్ 16.ప్రదీప్ జైశ్వాల్ 17.సంజయ్ రైముల్కర్ 18.సంజయ్ గైక్వాడ్ 19.ఏక్‌నాథ్ షిండే 20.విశ్వనాథ్ భోయిర్ 21.శంతారమ్ మోరె 22.శ్రీనివాస్ వంగ 23.ప్రకాశ్ అభిట్కర్ 24.చిమన్‌రావ్ పాటిల్ 25.సుహాస్ కందే 26.కిశోరప్ప పాటిల్ 27.ప్రతాప్ సర్‌నాయక్ 28.యామిని జాదవ్ 29.లతా సోనావానె 30.బాలాజీ కినికర్ 31.గులాబ్‌రావ్ పాటిల్ 32.యోగేశ్ కదామ్ 33.సదా సర్వాంకర్ 34.దీపక్ కేసార్కర్ 35. మంగేశ్ కుదాల్కర్

ఏక్‌నాథ్ వర్గంలోని స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇతరులు

36.రాజకుమార్ పాటిల్ 37.బచ్చు కదూ 38.నరేంద్ర భోందేకర్ 39.రాజేంద్ర పాటిల్ యాదవ్కర్ 40. చంద్రకాంత్ పాటిల్ 41.మంజుల గావిట్ 42.ఆశిష్ జైశ్వాల్

.

Related posts