telugu navyamedia
రాజకీయ

ఉద్ధవ్​కు గవర్నర్​ లేఖ, రేపు సాయంత్రంలోగ‌ బ‌ల‌ప‌రీక్ష‌కు హాజ‌రుకావ‌ల‌ని థాక్రే సర్కార్‌కు డెడ్‌లైన్‌

*బలపరీక్షకు హాజరు కావాలని ఉద్ధవ్​కు గవర్నర్​ లేఖ
*రేపు సాయంత్రంలోగ‌ బ‌ల‌ప‌రీక్ష‌కు హాజ‌రుకావ‌ల‌ని థాక్రే సర్కార్‌కు డెడ్‌లైన్‌

*కామాఖ్య ఆల‌యంలో షిండే ప్ర‌త్యేక పూజ‌లు
*రేపు బ‌ల‌ప‌రీక్ష‌కు హాజ‌ర‌వుతామ‌న్న రెబ‌ల్స్‌

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం క్లైమాక్స్ చేరుకుంది. శివసేన పార్టీలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో గురువారం (రేపు) మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది.

బలపరీక్షకు హాజరు కావాలని సీఎం ఉద్దవ్‌థాక్రే ప్రభుత్వాన్నిమహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారీ ఆదేశించారు. గురువారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని 30.06.2022 ఉదయం 11 గంటలకు నిర్వహించి.. సాయంత్రంలోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్‌ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా బలనిరూపణ నేపథ్యంలో.. ఈ రోజు రాత్రికి షిండే వర్గం గువాహతి నుంచి ముంబైకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. 

గౌహ‌తిలోని కామాఖ్య ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న ఏక్‌నాథ్ షిండే కూడా రేప‌టి ప్లోర్‌టెస్ట్‌కు ముంబై బ‌య‌లుదేరుతున్న‌ట్లు తెలిపారు. మ‌హారాష్ర్ట శాంతి, సంతోషం కోసం అమ్మ‌వారిని ప్రార్ధించిన‌ట్లు తెలిపారు. బలనిరూపణ తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని షిండే ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.

దీంతో సీఎం ఉద్ధ‌వ్ థాక్రే ప్ర‌భుత్వం ప‌డిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. శివసేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ మ‌హావికాస్ అఘాడీ ప్ర‌భుత్వం మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే అయిపోయింది. రెండున్న‌రేళ్లు అధికారాన్ని చెలాయించిన ఈ మూడు పార్టీలు గ‌ద్దె దిగే అవ‌కాశం ఏర్ప‌డింది.

 మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం 287 మంది సభ్యులు ఉన్నారు. ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 144గా ఉంది. రాజకీయ సంక్షోభం నెలకొనక ముందు శివసేన, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల కూటమికి 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

అయితే ప్రస్తుతం తనకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. వారిలో 39 మంది శివసేనకు చెందిన వారేనని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. ఎ

Related posts