telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నటిని పెళ్లి చేసుకోవడానికి ఏకంగా భార్యతో కలిసి అతడి ప్లాన్ …!?

Shadow

ఓ తమిళ నటి భర్త వేధింపులకు గురి చేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఏడాది క్రితం రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లైన వారం రోజులు అనుమానం రాకుండా బాగానే చూసుకున్నాడు. ఆ తరువాత శరవణన్‌కి ఇదివరకే పెళ్లైందన్న నిజం నటికి తెలిసింది. అంతేకాదు తన మొదటి భార్యతో కలిసి ప్లాన్ వేసి నటిని పెళ్లి చేసుకున్నాడట. ఇదంతా ఆమె ఆస్తి కోసం చేశాడట. ఈ విషయాన్ని సదరు నటి పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. తన పిల్లలను కూడా టార్చర్ పెడుతున్నట్లు తెలిపింది. ఆ ఫిర్యాదులో ఇంటికి ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చి వారిని ఎంటర్‌టైన్ చేయాలని అంటున్నాడట. దాంతో అతన్ని వదిలించుకుని పిల్లల్ని తీసుకుని వేరే కాపురం పెట్టింది. ఈ విషయం తెలిసి శరవణన్ నటిని కిడ్నాప్ చేయించాలని కుట్రపన్నాడు. దాంతో ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని తమిళనాడులోని తిరుమంగళం ప్రాంతంలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి ఈ కేసును పరిశీలిస్తున్నారు. ఇదివరకే ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ భర్తతో విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత ఆమె ఓ జిమ్ సెంటర్‌ను పెట్టుకుని తన పిల్లలను పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు శరవణన్ అనే 40 ఏళ్ల వ్యక్తి పరిచయమయ్యాడు. శివకార్తికేయన్ నటించిన ‘మాన్ కారటే’ సినిమాలో చిన్న పాత్రలో నటించింది ఈ నటి. తమిళ ఇండస్ట్రీలో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Related posts