telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సచివాలయంలో ప్రత్యక్షమైన సీఎం కేసీఆర్‌

ఢిల్లీ పర్యటన తర్వాత సీఎం కేసీఆర్‌లో విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు. కేంద్రం తీసుకువచ్చిన పథకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ…అభివృద్ధి పనులపై ఫోకస్‌ చేసారు సీఎం కేసీఆర్‌. దీంతో ప్రతిపక్షాలు కూడా కేసీఆర్‌ను విమర్శించలేకపోతున్నాయి. అయితే.. తాజాగా సీఎం కేసీఆర్‌ సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. సీఎం కేసీఆర్‌ సచివాలయానికి ఇవాళ వెళ్లారు. ఈ సందర్భంగా కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథుల తో మాట్లాడారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. ప్రధాన గేట్ తో పాటు, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని, డిజైన్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, ఇ ఎన్ సి గణపతి రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులున్నారు.

Related posts