telugu navyamedia
రాజకీయ

కర్నూలు జిల్లా స్కూల్ దంపతుల ఆత్మహత్యకు కారణం అదేనా?

” ఎవరిదీ ఈ హత్య”
ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు చెల్లించని తల్లితండ్రులదా?…. కట్టవలసిన అవసరం లేదు
అన్న ఓ ఎమ్మెల్యేదా?…. లేక
ఫీజు అడిగితే కేసు పెడతాం అన్న అధికారులదా?….. లేక
70% మాత్రమే ఫీజు తీసుకోమన్న ప్రభుత్వానిదా?….
TC లకు విలువ లేకుండా,
టీసీలు లేకుండానే అడ్మిషన్ చేర్చుకొమ్మన్న విద్యాశాఖ అధికారులదా?…..
అవకాశం దొరికింది కదా అని ఆన్లైన్లో విద్యార్థుల పేర్లు మేనేజ్మెంట్ కు తెలియకుండా తొలగిస్తున్న మండల విద్యాశాఖ అధికారులదా?…. *ఎప్పుడూ పనికట్టుకుని బడ్జెట్ స్కూల్లను విమర్శించే సంఘాల నాయకులదా?……
ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసైనా…..
ఎన్ని కష్టాలు పెట్టినా…., ఎన్నెన్ని ఇబ్బందులు ఎదురైనా… పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోన్న ప్రైవేట్ పాఠశాలల సంఘాలదా?…..
ఎవరు! ఎవరు! ఈ బాధ్యత వహించగలరు? పోయిన ప్రాణం ఎవ్వరు? ఎవ్వరు? తీసికొని రాగలరు? ఇప్పటికైనా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వము మరియు విమర్శించే సంఘాలు, ఏదేని ఒక్క విషయంలో మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు, ఓ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి, మేధోమధనం గావించి, మంచి చెడులను చర్చించి, రూట్ లెవెల్ నందు ఉన్న వారితో చర్చించి, తదుపరి మాత్రమే మాటలు మాట్లాడితే బాగుంటుందని మనవి.

మీ ఒక్క మాట వల్ల ఎంతమంది ప్రేరణ పొంది ఫీజు ఎగ్గొట్టారో, ఈ అవకాశం కొరకు ఎంతమంది వేచి ఉన్నారో బడ్జెట్ స్కూళ్ళు మేనేజ్మెంట్ కన్నీటిని అడిగితే చెప్తుంది, తన కన్నీటి బరువెంతో
దానికి వారు చెల్లించిన మూల్యం ఎంతో…….
ఎన్ని గుండెలు ఆగెనో….
ఇంకెన్ని గుండెలు ఆగునో…..
మరేన్ని తనువులు చాలించునో……

B.Ed చేసి ఉద్యోగం లేక ఏదో అవకాశం ఉంది కాబట్టే ఈ రంగంలోనికి వచ్చాము,
వచ్చాము కాబట్టి ఇంకొక రంగం వైపు వెళ్ళ లేక ఎలాగోలాగా నెట్టుకొస్తున్నాము , అంతే కానీ తెలివి తక్కువ అయి కాదు, దోచుకోవటానికి అంతకంటే కాదు.

ప్రైవేట్ పాఠశాలలు వద్దు అనుకుంటే ఒక్క ప్రభుత్వ ఉత్తర్వుతో అన్నిటినీ మూసి వేయండి, మా దారిన మేం పోతాము. మా చావు మేం చస్తాం.
ఎందరో మేధావులను దేశానికి అందించిన గురువుల పరిస్తితి ఇదా?
దయనీయం, దారుణం, గర్హనీయం

చదువు నేర్పు గురువుల యెడ ఎందుకింత ఏహ్యభావం,
ఎందుకింత చిన్నచూపు.
మోసే వారికే తెలుస్తుంది కావటి బరువు అన్నట్లు,
ఎవ్వరి కష్టాలు వారికే తెలుస్తాయి. ఈత కొట్టే వాడికి వచ్చే ఆయాసం గట్టున ఉన్న వాడికి ఎలా తెలుస్తుంది.
మాట్లాడే వారు మీరు ఒక్క స్కూల్ పెట్టీ మెయింటైన్ చేస్తే తెలుస్తుంది బరువు భాధ్యత.
ఇంకొక ప్రాణం మళ్లీ పోకుండా జాగ్రత్త వహిస్తారని ఆశిస్తూ…..

సుబ్రమణ్యం మరియు రోహిణి గార్లకు
😭 అశ్రు నివాళితో 😭
*ఓ బడ్జెట్ స్కూల్ కరస్పాండెంట్*

Related posts