telugu navyamedia
ఆరోగ్యం

నిద్ర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

 శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి నిద్ర. మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని, శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనదని, నిద్ర పౌరుల ప్రాథమిక హక్కని, ఆరోగ్య జీవనానికి చాలా అవసరమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచివి కావని పలు అధ్యయనాల్లో తేలింది. ఓ పరిశోధనలో 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్థ్యం తగ్గినట్లుగా గుర్తించారు. నిద్రపై ఇంకా విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి నెల మూడవ శుక్రవారం నాడు ప్రపంచ నిద్ర దినోత్సవం జరుపుకుంటారు.

*సాధారణంగా పెద్దలకంటే పిల్లలకు ఎక్కువగా నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం.
*అప్పుడే పుట్టిన పిల్లలైతే సుమారు 18 గంటల నిద్ర అవసరం, వారు పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గిపోతుంది.
* చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలి, పెద్దలు 7-8 గంటలు నిద్రపోవాలి అని నిపుణులు అంటున్నారు.


*నిద్ర వలన మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దానితో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
*శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది.
*నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది.
*హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ నిద్ర వలన సక్రమంగా జరుగుతుంది.
*నిద్ర తగ్గితే కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి.
* నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.
*ఏడు గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయేవారికన్నా, తక్కువ నిద్రపోయేవారికి జలుబు త్వరగా వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.
*నిద్రలేమి ఊబకాయానికి దారితీస్తుంది.
*అతినిద్రతో జ్ఞాపకశక్తి క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
*ఒకేచోట కూర్చొని పనిచేసే ఉద్యోగులపై నిద్ర లేమి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
*మహిళలు ఎక్కువగా నిద్రలేమితో బాధపడుతున్నారని ఓ పరిశోధనలో తేలింది
*రాత్రిపూట 10 గంటలపాటు నిద్రపోవాలని నిపుణులంటున్నారు.
*స్మార్ట్‌ఫోన్‌ల నుంచి వెలువడే నీలం రంగు వెలుతురు కళ్లపై పడి నిద్ర రాకుండా చేస్తుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.

Related posts