telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ ను .. ఉపేక్షించే ఓపిక భారత్ కు లేదు .. : రవీష్‌కుమార్‌

india will not bare anymore is sure

ఒక్క ఈ ఏడాదిలోనే పాక్ ఇప్పటి వరకూ 2050 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, 21 మంది భారతీయుల ప్రాణాలను తీసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్‌ తెలిపారు. జమ్ముకాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ రద్దు చేసి, కాశ్మీరీల మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ ఐక్య రాజ్యసమితి మానవ హక్కుల మండలిలో పాకిస్థాన్‌ చేసిన ఫిర్యాదుపై ఆయన మండిపడ్డారు. జమ్ముకాశ్మీర్‌ అంశం భారత అంతర్గత విషయమని, అంతర్జాతీయ సమస్యగా మార్చాలని పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోందని అన్నారు. పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, సరిహద్దు రేఖ వద్ద భారతీయ పౌరులు, బోర్డర్‌ పోస్టులే లక్ష్యంగా కాల్పులు జరుపుతోందని విమర్శించారు.

సరిహద్దు రేఖ వద్ద కాల్పులను విరమించాలని, టెర్రరిస్టులకు మద్దతు తెలపవద్దని పదేపదే పాక్ ను కోరుతున్నా ప్రయోజనం లేకపోయిందని ఆయన పేర్కొన్నారు. 2003లో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ కట్టుబడి ఉండాలని ఆయన డిమాండ్‌ చేశారు. జైషే మహ్మద్‌ ఆత్మాహుతి బాంబర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిపిన దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు మరణించినప్పటి నుంచి భారత్‌, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని తెలిపారు. ఇప్పటి వరకూ సంయమనం పాటించామని, ఇకపై దీటుగా సమాధానం చెబుతామని అన్నారు.

Related posts