కేటీఆర్ తన నివాసం నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు.
ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది.
అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఒక్కొక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియంకు తరలిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది.
వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈడీ కార్యాలయంలోకి కేటీఆర్ మినహా మరెవరినీ అనుమతించలేదు.