పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
శుక్రవారం ఈ కేసుపై విచారించిన హైకోర్టు.. సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రూ.25వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఓ సంస్థ పేరుతో రూ.50 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో సీబీఐ కోర్టు కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సీబీఐ కోర్టు తీర్పును కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టులో సవాల్ చేయడంతో సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 16కు వాయిదా వేసింది.
వైఎస్ వివేకాను ఇంటి దొంగలే హత్య చేశారు: చంద్రబాబు