telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బీజేపీలోకి కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి…?

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి.. ఇప్పటివరకు ఏ పార్టీలో చేర‌లేదు.. ఏ పార్టీలో చేరాల‌న్న‌దానిపై కొన్ని రోజుల త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటాన‌ని త‌న రాజీనామా సంద‌ర్భంగా వెల్ల‌డించారు. అయితే, ఆయ‌న బీజేపీ గూటికి చేర‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం అప్ప‌టినుంచి జ‌రుగుతూనే ఉంది. ఇక‌, ఇవాళ బీజేపీ నేత డీకే అరుణతో స‌మావేశ‌మ‌య్యారు కొండా విశ్వేశ్వరరెడ్డి.. పార్టీలో చేరిక పై చర్చించినట్టు స‌మాచారం.. ఈ విష‌యంలో ఆలస్యం చేయొద్దని వెంటనే నిర్ణయం తీసుకోవాల‌ని డీకే అరుణ సూచించిన‌ట్టుగా చెబుతున్నారు.. దీనికి విశ్వేశ్వ‌ర్‌రెడ్డి కూడా సానుకూలంగానే స్పందించార‌ని టాక్ న‌డుస్తోంది.. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే.. త్వరలోనే కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి.. బీజేపీలో చేరే అవ‌కాశం ఉందంటున్నారు. ప‌రిణామాలు చూస్తుంటే.. ఆయ‌న బీజేపీలో చేర‌తార‌ని చెబుతున్నారు.. ఈట‌ల రాజేంద‌ర్.. బీజేపీలో చేర‌డానికి కొండా రాయ‌బారం కూడా న‌డిపార‌మే ప్ర‌చారం కూడా జ‌రిగింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts