telugu navyamedia
క్రీడలు వార్తలు

వారి సిరీస్ మాకు పాఠాలు నేర్పిస్తుంది : అశ్విన్

ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడటం న్యూజిలాండ్‌కు ప్రయోజనకరమని… అయితే వారి ఆటను జాగ్రత్తగా పరిశీలిస్తే తమకు ఓపాఠం అవుతుందని పేర్కొన్నాడు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ప్రాక్టీస్‌కు తగిన సమయం లేకున్నా ఆస్ట్రేలియాలో మాదిరిగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అయితే తాజాగా అశ్విన్ మాట్లాడుతూ… ‘మా ప్రాక్టీస్ మొదలయ్యేందుకు కనీసం మరో వారం పది రోజులు పడుతుంది. ఐపీఎల్‌ వాయిదా పడ్డప్పటి నుంచి ఆటగాళ్లు క్రికెట్‌ ఆడలేదు. ఇది మాకు పెద్ద సవాలే. కానీ ఒక్కసారి ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాక టీమిండియా త్వరగా పరిస్థితులకు అలవాటు పడగలదు. ఆస్ట్రేలియాలో మాదిరిగా ప్రదర్శనలు చేయగలదు’ అని అశ్విన్‌ ధీమా వ్యక్తం చేశాడు.. ‘మ్యాచ్‌కు సన్నద్ధమవ్వడం, మ్యాచ్‌ కోసం సాధన చేయడం భిన్నమైనవి. ఐపీఎల్‌ వాయిదా పడ్డాక మేం ఇంగ్లాండ్‌ వెళ్తున్నాం. ఇంగ్లండ్‌తో ఆడే రెండు టెస్టులు కివీస్‌కు అనుభూతిని ఇస్తాయి. అదే సమయంలో వారి మ్యాచులు చూడటం మాకు విలువైన పాఠాలు అవుతాయి. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగే మ్యాచులు చూడటం, పాత వీడియోలు చూడటం ప్రయోజనకరం’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Related posts