ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని మీడియా సంస్థలు తన ఇంట్లోని ఫర్నీచర్ దుర్వినియోగం అవుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. అయినా కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నా వద్ద ఉన్న ఫర్నీచర్ విషయంలో ఎటువంటి కంగారు అక్కర్లేదని, ప్రతి వస్తువుకు తనవద్ద లెక్క ఉందని తెలిపారు. నేను ఎటువంటి తప్పు చేయలేదని ముందు నుంచీ చెబుతూ వస్తున్నానని తెలిపారు. ఫర్నీచర్‌కు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిని అప్పగించడమా, డబ్బు చెల్లించడమా అనే విషయం పై స్పష్టత ఇవ్వాలని కోరానని గుర్తు చేశారు.
కశ్మీర్ అమ్మాయిలకు లైన్ క్లియర్.. హరియాన సీఎం అనుచిత వ్యాఖ్యలు