telugu navyamedia
రాజకీయ

మూడో రోజు ఈడీ ఎదుట హాజ‌రైన రాహుల్ గాంధీ..

*ఢిల్లీలో ఈడీ కార్యాల‌యం వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త‌..
*ఈడీ కార్యాల‌యంలోకి దూసికెళ్లేందుకు కార్య‌క‌ర్త‌లు ప్ర‌య‌త్నం..
*కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో నేషనల్ హెరాల్డ్ మనీ-లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడో రోజైన బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు అయ్యారు.

రాహుల్​ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్​ నిరసనలు ఉద్ధృతంగా మారాయి. వందలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈడీ కార్యాల‌యంలోకి దూసికెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేయ‌గా ..పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యం ప‌క్క‌నే ఉన్న ప్రాంతంలో పోలీసులు 144 సెక్ష‌న్ అమ‌లు చేశారు. 

కాగా.. గత రెండు రోజుల్లో దాదాపు 21 గంటల పాటు రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు.  పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీ స్టేట్మెంట్​ను.. ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. రాహుల్ సమాధానాలపై ఈడీ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆర్ధిక లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల గురించి సరైన సమాధానాలు ఇవ్వడం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకు ఆయన 80 ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు వెల్లడించాయి. అయితే, రాహుల్ పదేపదే తన వాంగ్మూలాన్ని మార్చుకోవడం వల్ల విచారణ ఆలస్యమైందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

Related posts