ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన తమ మధ్య లేరన్న వార్త చాలా బాధాకరంగా ఉందనన్నారు. కోడెల ఓ రాజకీయనాయకుడిగా, వైద్యుడిగా సమాజానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, అందరి హృదయాల్లో పదిలంగా ఉంటారని అన్నారు.
హైదరాబాద్ లో బసవతారకం ఆసుపత్రిని నిర్మించాలని తన తండ్రి ఎన్టీ రామారావు అనుకున్నప్పుడు కోడెల ముఖ్యమైన పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. కోడెల ఎంతో మందికి ఆదర్శనీయుడని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మరిచిపోలేని సేవలు అందించారని చెప్పారు. కోడెల ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.


రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థను నాశనం చేశారు: చంద్రబాబు