telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : రెండో విజయాన్ని నమోదు చేసిన పంజాబ్…

ఐపీఎల్ 2020 లో ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆర్సీబీ జట్టులో కెప్టెన్ కోహ్లీ (48) ఆ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా చివర్లో క్రిస్ మోరిస్ వచ్చి 8 బంతుల్లోనే 25 పరుగులు చేసాడు. దాంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన పంజాబ్ మొదటి నుండి విజయం వైపుకే పరుగులు తీసింది. జట్టు టాప్ ఆర్డర్ రాణించడంతో పంజాబ్ కేవలం రెండు వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ మయాంక్ (45) పరుగుల వద్ద ఔట్ అయిన తర్వాత కెప్టెన్ రాహుల్(61*) అలాగే గేల్ (53) అర్ధశతకాలతో రాణించారు. కానీ చివరి ఓవర్లో 2 పరుగులు కావాల్సిన సమయంలో బౌలర్ చాహల్ మొదటి మూడు బంతిలో కేవలం ఒకే పరుగులు ఇచ్చాడు . ఆ తర్వాత ఆ ఓవర్లో 5 వ బంతికి గేల్ రన్ ఔట్ కావడంతో ఒక బాల్ లో ఒక పరుగు కావాల్సిన సమయం వచ్చింది. దాంతో అందరూ సూపర్ ఓవర్ అవుతుంది అనుకున్నారు. కానీ గేల్ తర్వాత చివరి బంతి ఆడటానికి వచ్చిన నికోలస్ పూరన్ సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. దాంతో పంజాబ్ ఈ ఐపీఎల్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది. అయితే పంజాబ్ మొదటి విజయం కూడా బెంగళూరు పైనే కావడం విశేషం.

Related posts