కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫాంటమ్’’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను డైరెక్టర్ అనూప్ భండారి విడుదల చేశారు. ఇందులో సుదీప్ ‘విక్రమ్ రోనా’ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రను పరిచయం చేస్తూ “ఈ పేరు ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో, క్యారెక్టర్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. తను ఏం చేస్తాడు? ఎందుకు చేస్తాడు? అని ఎవరికీ తెలియదు. కానీ ఆ పనుల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది” అంటూ డైరెక్టర్ అనూప్ సుదీప్ పాత్ర గురించి ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోవిడ్ 19 తర్వాత ప్రభుత్వ విధి విధానాల మేరకు షూటింగ్ మొదలుపెట్టారు చిత్రబృందం. షూటింగ్ కూడా హైదరాబాద్‌లోనే కావడం విశేషం.
previous post
next post