telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు అర్జున్ కు ఫిదా అయిన మరో హీరోయిన్

Noorin-Shareef-and-allu-arjun

ఇటీవల తెలుగులో విడుదలైన “లవర్స్ డే” (ఒరు అడార్ లవ్‌) చిత్రంలో ఒక కథానాయికగా నటించిన మలయాళీ హీరోయిన్ నూరిన్ షరీఫ్. గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటోంది నూరిన్. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. చిన్నప్పటి నుంచి తనకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని, మలయాళంలో కూడా అల్లు అర్జున్ సినిమాలు విడుదలవుతాయని, పెళ్లంటూ చేసుకుంటే అల్లు అర్జున్ లాంటి వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలని అనుకునేదాన్నని తెలిపింది నూరిన్. ఇక “లవర్స్ డే” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ విచ్చేశాడని, ఆ వేడుకలో అల్లు అర్జున్ తో తాను మాట్లాడుతున్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాడని, కానీ అతనెవరో తనకు తెలియదని, అప్పటి నుంచి ఆ ఫోటో ఎక్కడైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నానని అల్లు అర్జున్ పై ఉన్న అభిమానాన్ని వెల్లడించింది. అంతేకాదు ఇప్పుడు నూరిన్ కు తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయట.

Related posts