ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు విజయవాడలో ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాంమాధవ్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్లలో బీజేపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దాలని అన్నారు.
మన పార్టీలో ఎవరికి అప్పగించిన బాధ్యతను వారు చక్కగా నిర్వహిస్తున్నారు. కన్నా గారి స్థానంలో సోము వీర్రాజు రావడంతో కన్నా గారిని తీసేశారన్న విమర్శలు రావాల్సిన అవసరం లేదు. కన్నా గారు రాబోయే రోజుల్లో మరో బాధ్యతను తీసుకుని పని చేసే అవకాశం లభిస్తుంది’ అని రాంమాధవ్ తెలిపారు.
ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకుండానే కొనసాగుతోందని రాంమాధవ్ ఎద్దేవా చేశారు. కనీసం అధ్యక్షుడిని కూడా ఎంపిక చేసుకోలేని స్థితిలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. బీజేపీలో మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు చాలా సహజంగా అధ్యక్షులు నియమితం అవుతున్నారు’ అని రాంమాధవ్ చెప్పారు.సోము వీర్రాజు నాయకత్వంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని బలపర్చడానికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రధాని హెలికాప్టర్‌ను తనిఖీ చేస్తే సస్పెండ్ చేస్తారా : యనమల