telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న 93 ఏళ్ల వృద్ధుడు

karona

కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన 93 ఏళ్ల వయస్సున్న వృద్ధుడు కోలుకున్నాడు. అంతేగాదుఆయన భార్య కూడా ఆరోగ్యంగా ఉండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ తెలిపారు. చైనా నుంచి వచ్చిన ఈ మహమ్మారి తొలుత కేరళ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి పినరయి విజయన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అలాగే పథనంతిట్ట జిల్లా రాన్ని ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులకు కుమారుడున్నాడు. ఇతను ఇటలీలో ఉంటున్నారు. ఇతను భార్య పిల్లలతో వృద్ధ దంపతుల నివాసానికి వచ్చారు. ఈ సమయంలో కరోనా మెల్లిమెల్లిగా విజృంభిస్తోంది. ఇది కాస్తా..వృద్ధ దంపతులకు సోకింది. మొత్తం ఏడుగురు వైరస్ బారిన పడ్డారు. వీరిని కొట్టాయం మెడికల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు ఇచ్చిన సూచనలను క్రమం తప్పకుండా పాటించడంతో వీరు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.

Related posts