telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి: రాష్ట్రాలకు కేంద్రం సూచన

rjasthan corona

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు ఓ సర్క్యూలర్‌ను విడుదల చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖ రాశారు. ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఏ చర్య తీసుకోవాలో సవివరమైన నిబంధనల జాబితాను రాష్ట్రాలకు కేంద్రం పంపింది.

లాక్‌డౌన్‌ నియమాలు ఉల్లంఘించిన వ్యక్తులు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌- 2005లోని సెక్షన్‌ 51, 60 ప్రకారం అదేవిధంగా ఐపీసీ సెక్షన్ల కింద శిక్షార్హులు అని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించడమే ఒకే ఒక్క పరిష్కారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి.

Related posts