telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అతనిచ్చిన లవ్ లెటర్ ను అలా దాచుకుందట… సీక్రెట్ ను బయటపెట్టేసిన కీర్తిసురేష్

Keerthy

‘మహానటి’ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు సంపాదించుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘మిస్ ఇండియా’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఇక ఈ అమ్మడు అటు తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ‘అన్నాత్తే’ చిత్రంలో, తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలు చేస్తుంది. అదే విధంగా యంగ్ హీరో నితిన్ తో ‘రంగ్ దే ‘ చిత్రంలోనూ నటిస్తుంది. కీర్తి మరో అగ్రకథానాయకుడు కమల్‌హాసన్‌ సరసన కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు సమాచారం. ఇకపోతే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కాలేజీ రోజుల్లో ప్రేమ సంగతులు, లైఫ్ సీక్రెట్స్ వెల్లడించింది ఈ బ్యూటీ. కాలేజీ రోజుల్లో మీ ప్రేమ సంగతులు చెప్పండి.. మీకు ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి అని యాంకర్ అడిగిన ప్రశ్నపై ఓపెన్‌గా సమాధానం చెప్పింది కీర్తి సురేష్. కాలేజీ రోజుల్లో తనకు ప్రేమ లేఖ ఒక్కటి కూడా రాలేదని చెప్పిన ఆమె.. ఓ అభిమాని ఇచ్చిన లవ్ లెటర్ సంఘటన గురించి మాత్రం చెప్పింది. ఓ సారి తాను జ్యూయెలరీ షాప్ ఓపెనింగ్‌కు వెళ్లగా.. ఓ అభిమాని బహుమతి ఇచ్చాడని, అది తెరచి చూస్తే తన ఫొటోలతో కూడిన ఆల్బమ్‌తో పాటు.. తనకు ప్రపోజ్ చేస్తూ ఓ లవ్ లెటర్ అందులో ఉంచాడని చెప్పింది. అయితే దాన్ని ఇప్పటికీ భద్రం దాచుకున్నా అంటూ సీక్రెట్ బయటపెట్టేసింది కీర్తి సురేష్.

Related posts