telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిమ్మగడ్డ వ్య్వహారంలో ఏపీ సర్కార్ కు సుప్రీం షాక్ !

Nimmagadda ramesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? అని జగన్ సర్కార్‌పై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.

నిమ్మగడ్డను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టులో ఈ కేసు ఉందని… సుప్రీం తీర్పు కోసం తాము వేచి చూస్తున్నామని వైసీపీ నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించే తీరు ఎలా ఉంటుందో వేచిచూడాలి.

Related posts