telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

హిందూ దేవుళ్ల బొమ్మలతో బాత్ మ్యాట్స్… దేశవ్యాప్తంగా విమర్శలు…

Shiva

ఇటీవల ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ హిందూ దేవుళ్ల బొమ్మలను టాయిలెట్‌ మ్యాట్స్‌పై చిత్రీకరించి ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టగా దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దాంతో అమెజాన్ వెంటనే వాటిని తొలగించి క్షమాపణలు కోరింది. తాజాగా యూఎస్‌లోని బాస్టన్‌కు చెందిన వేఫెయిర్ కంపెనీ ఇదే మాదిరిగా బాత్ మ్యాట్స్‌పై హిందూ దేవుళ్ల ఫొటోలను ప్రింట్ చేసి వివాదంలో చిక్కుకుంది. గృహ ఉపకరణాలను విక్రయించే ఈ కంపెనీ హిందూ దేవుళ్లైన శివుడు, వినాయకుడి బొమ్మలతో బాత్ మ్యాట్స్‌ను రూపొందించి అమ్మకానికి పెట్టింది. ఒక్కొ మ్యాట్ ధర 38 డాలర్లు(రూ.2,673)గా పేర్కొంది. అలాగే ఆన్‌లైన్‌లో కూడా వీటిని అందుబాటులో ఉంచింది. ఈ మ్యాట్స్‌కు “యోగా ఏసియన్ లార్డ్ విత్ థర్డ్ ఐ బాత్ రగ్ బై ఈస్ట్ అర్బన్ హోమ్”, “ఏసియన్ ఫేస్ ఆఫ్ ఎలిఫెంట్ లార్డ్ బాత్ రగ్” అనే పేర్లతో విక్రయానికి పెట్టింది. దీంతో సదరు కంపెనీపై విమర్శలు వెలువెత్తాయి. గతేడాది కూడా ఇదే సంస్థ కటింగ్ బోర్డులపై గణేషుడి బొమ్మలను ముద్రించి విమర్శలు ఎదుర్కొంది. హిందూ కార్యకర్తలు వెంటనే వాటిని నిలిపివేయాలని ఆందోళనకు దిగడంతో చివరకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

Related posts