telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీతో యుద్దానికి సై : త్వ‌ర‌లో హైద‌రాబాద్ వేదిక‌గా కేసీఆర్ కొత్త పార్టీ..

*జాతీయ రాజ‌కీయాల్లో సీఎం కేసీఆర్‌
*త్వ‌ర‌లో హైద‌రాబాద్ వేదిక‌గా కేసీఆర్ కొత్త పార్టీ..
*ఈ నెల 11న మాజీ సీఎం కుమార‌స్వామి..

*తెలంగాణ సీఎంగా ఉంటూనే జాతీయ రాజ‌కీయాల్లోకి కేసీఆర్‌
*కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప్ర‌త్యామ్నాయ శ‌క్తి..
*జాతీయ పార్టీ ఏర్పాటు తరువాతే ఫ్రంటులు, పొత్తులు

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. త్వరలోనే కేసీఆర్‌ సారథ్యంలో ప్రత్యామ్నాయ జాతీయ రాజకీయ శక్తి అతి త్వరలో ఆవిర్భవించ‌నుంది.

హైదరాబాద్ వేదికగా కొత్త పార్టీని కేసీఆర్ ప్రకటించ‌నున్నారు. భారత రాష్ట్ర సమితి పేరును ఖరారు చేయనున్నారు. వివిధ వర్గాలతో చర్చలు జరిపిన‌ తర్వాత కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

గత కొన్నాళ్ల నుంచి జిల్లాల్లో పర్యటిస్తూ జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అని ప్రజలను ప్రశ్నిస్తున్న కేసీఆర్ ఇక పార్టీ ప్రకటించడమే ఆలస్యమని పార్టీ నేతలు చెబుతున్నారు.

రైతులు, బడుగు బలహీనవర్గాల అజెండాగా ఈ పార్టీని కేసీఆర్ ప్రారంభించనున్నారు. కొత్తపార్టీపై కేసీఆర్ చేసిన కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో ఈ పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేయనున్నారు. మేధావులు, రైతులతో ఆయన చర్చించారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి బీజేపీయేతర పార్టీల నేతలను కలసి వచ్చారు.

పార్టీ పెట్టిన తర్వాతనే ఫ్రంట్‌లు, పొత్తులు విషయం ఉంటాయని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 11న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హైదరాబాద్ వస్తున్నారు. ఆ తర్వాతనే పార్టీ ప్రకటన ఉండే అవకాశముందని తెలిసింది.

కాగా..సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా తెలంగాణ వస్తుందా? ఇది అయ్యే పనేనా? అన్న సందేహాలే ఎక్కువగా వినిపించేయి. కానీ.. కేసీఆర్‌ ఒక్కడుగా తెలంగాణ జెండా పట్టుకొని బయల్దేరాడు. ఉద్యమ పార్టీని ప్రారంభించాడు. తన వాదన బలంగా వినిపించాడు. చివరికి దేశంలోని ప్రతి పార్టీతోనూ జై తెలంగాణ అనిపించాడు. అదే విదంగా జాతీయ పార్టీ ఒకటి అవతరించ‌నున్న‌ట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

Related posts