కన్నడ సినీ నటుడు కుమార్ మగళవారం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 24 ఏళ్ల కుమార్ బెంగుళూరు గాంధీ నగర్ లో నివాసం ఉంటున్నాడు. శివరాజ్ కుమార్ నటించిన హిట్ చిత్రం భజరంగి సినిమాలో కుమార్ విలన్ గా నటించాడు. అయితే నిన్న మధ్యాహ్న సమయంలో బైక్ పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారు కుమార్ బైక్ ని బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ కుమార్ ని స్థానికులు వెంటనే హాస్పటల్ కి తరలించారు. అయితే తలకు బలంగా గాయమవ్వడంతో చిక్కిత్స పొందుతూ కొద్దిసేపటికే కుమార్ కన్నుమూశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. నటుడిగా కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్న కుమార్ హఠాత్తుగా మరణించడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. పలువురు సినీ ప్రముఖులు కుమార్ మృతదేహానికి నివాళులు అర్పించారు.
							previous post
						
						
					


అలీ తాజా వ్యాఖ్యలతో వైసీపీలో అసంతృప్తి!