telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేనూ హీరోనే… కానీ నా భార్యకు ఆ హీరో అంటేనే…!?

Sudeep

కిచ్చా సుదీప్ కన్నడలో ప్రముఖ హీరో అన్న విషయం తెలిసిందే. ఆయన హీరోగానే కాకుండా పలు చిత్రాల్లో విలన్ గా కూడా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్, సుదీప్ నటించిన ‘దబాంగ్ 3’ సినిమా క్రిస్మస్‌కి విడుదల కాబోతోంది. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా కథానాయికగా నటించారు. ఈ సినిమాలో సుదీప్‌ను సల్మాన్‌కు సమానంగా చూపించారు. క్లైమాక్స్‌లో జరిగే ఫైటింగ్‌ సీన్‌లో సల్మాన్, తాను జంతువుల్లా కొట్టుకున్నామని తెలిపారు. సుదీప్ నటించిన మూడో హిందీ సినిమా ‘దబాంగ్ 3’. ఇందులో ఆయన బల్లీ సింగ్‌ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుదీప్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ గురించి మాట్లాడారు. తనకు హీరో అయినప్పటికీ ఆయన భార్య మాత్రం మరో హీరో కోసం పడి చస్తుందట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “నేను హృతిక్ రోషన్‌తో సినిమా చేస్తున్నానని తెలిస్తే అందరికంటే ముందుగా సెట్స్‌కు వచ్చేది నా భార్యే. తను హృతిక్‌కు వీరాభిమాని. ఆమె కోసమే నేను హృతిక్ నటించిన తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’ పది సార్ల కంటే ఎక్కువగా చూశాను. ఒకవేళ సినిమాకు తీసుకెళ్లకపోతే నన్ను బెదిరించేది. నేను తీసుకెళ్లకపోతే తన స్నేహితులతో వెళ్లిపోయేది. నేను తొలిసారి ఆ సినిమా చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. నాకు హృతిక్ అతని డ్యాన్స్ చాలా నచ్చింది. స్క్రీన్‌పై హృతిక్ రోషన్ ఎప్పుడు డ్యాన్స్ చేసినా నా భార్య నా చెయ్యి పట్టుకుని గిచ్చేది. నేను కూడా హీరోనే కదా అని మనసులో తిట్టుకునేవాడిని. అలా ‘కహో నా ప్యార్ హై’ నా జీవితంలో ఒక భాగం అయిపోయింది” అని తెలిపారు.

Related posts