telugu navyamedia
సినిమా వార్తలు

తాప్సి ఎవరు అలా అనడానికి ?… కంగనా సోదరి రంగోలి ఫైర్

Taapsee-and-Rangoli

కంగనా నటించిన “జడ్జిమెంటల్ హై క్యా” ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో నటి తాప్సీ కూడా ట్రైలర్ బాగుందని ట్వీట్ చేశారు. తాప్సీ ట్వీట్ పై కంగనా సొందరి రంగోలీ స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “కొంతమంది కంగనాను కాపీ కొడుతూ బతికేస్తున్నారు. అలాంటి వారు ట్రైలర్ బాగుందని ప్రశంసించేప్పుడు కనీసం కంగనా పేరు కూడా ప్రస్తావించరు. ఓసారి తాప్సీ కంగనను ఉద్దేశిస్తూ ఆమె ఓ అతివాది అని వ్యాఖ్యానించింది. తాప్సీ.. ముందు ఇలా చీప్ గా ఇతరుల వర్క్ ను కాపీ కొట్టడం ఆపండి” అంటూ తిట్టిపోసింది.

ఈ విషయంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కలగజేసుకొని ”రంగోలీ.. ఇది చాలా దూరం వెళుతోంది.. నేను నీ సోదరి కంగనతో, తాప్సీతో కలిసి పని చేశాను. ట్రైలర్ ను మెచ్చుకున్నారంటే.. అందులోని నటీనటులను కూడా మెచ్చుకున్నట్లే కదా..” అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రంగోలీ.. “కంగనా పేరుని ప్రస్తావించారా..? లేదా..? అనేది ఇక్కడ విషయం కాదని.. ఇప్పటివరకు ట్రైలర్ మెచ్చుకున్నవారు కంగనా గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కంగనాపై కామెంట్లు చేసిన వారితో విసిగిపోయాను. కంగనా ఓ అతివాది అని అనడానికి తాప్సీ ఎవరని..? అసలు నా సోదరిని పట్టుకొని అంత మాట అంటుందా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related posts