రాష్ట్రంలోని ఆలయాల ఆస్తులు అమ్మకానికి పెట్టారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణఆరోపించారు. ఆలయాలకు చెందిన భూముల అమ్మకం విషయంలో ఎన్ని లేఖలు రాసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. ఆలయాల భూములను విక్రయించడం కుదరదని, తాము ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
ద్వారకా తిరుమల ఆలయ భూమిని వేలం వేస్తున్నారని, మంగళగిరి పానకాల స్వామి ఆలయ భూములు కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు గత ముఖ్యమంత్రి ఆలయాలు కూల్చితే, ఇప్పటి సీఎం ఆలయాల ఆస్తులు అమ్మకానికి పెట్టారని విమర్శించారు. ఎన్నికల సమయంలో అమలు చేయడానికి సాధ్యంకాని హామీలు గుప్పించి, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.
ఆ విషయాల్లో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది: బీజేపీ